మిర్చి @ 27,200 బస్తాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం రికార్డు స్థాయిలో 27,200 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్లో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి.
కాశీబుగ్గ, జనవరి 24: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం రికార్డు స్థాయిలో 27,200 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్లో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి రోజుకు రెండు వేల నుంచి 10 వేల వరకు బస్తాలు వచ్చాయి. సంక్రాంతి పండుగ తర్వాత బస్తాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది.
ఈ నెల 19న అత్యధికంగా 25 వేలు, సోమవారం, మంగళవారం 20 వేలకు పైగా బస్తాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో అడ్తి, ఖరీదు వ్యాపారులతోపాటు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మార్కెట్కు లక్షా 13 వేల క్వింటాళ్ల మిర్చి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. తేజ రకం క్వింటాల్కు రూ. 20,200, వండర్హాట్ రూ. 19 వేలు, యూఎస్ 341 రూ. 16,800, తాలు రకం రూ. 8700 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
మార్కెట్కు మూడు రోజులు సెలవు
ఎనుమాముల మార్కెట్కు మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి సంగయ్య తెలిపారు. శుక్రవా రం గణతంత్ర దినోత్సవం, శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం వారాంతపు సెలవు. 27న సీసీఐ కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని, 29 నుంచి మార్కెట్లో క్రయవి క్రయాలు పునఃప్రారంభం అవుతాయని వెల్లడించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

