ఖిలావరంగల్, డిసెంబర్ 30: పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 45 ఏండ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న ఆర్వోబీ సమీపంలో పట్టాలు దాటుతున్నాడు.
ఈ క్రమంలో రైలు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్ డిప్యూటీ రైల్వేస్టేషన్ మాస్టర్ రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.