గిర్మాజీపేట, నవంబర్ 7: తెలంగాణ ప్రశాంతంగా ఉండాలంటే అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని, కాంగ్రెసోళ్లను నమ్మి ఓటువేస్తే రాష్ట్రం ఆగం అవుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీషా శ్రీమాన్ ఆధ్వర్యంలో మంగళవారం నోబుల్ ఫంక్షన్ హాల్లో ముస్లిం నాయకులు ఏర్పాటు చేసిన గ్యార్మీ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధికి అన్నివిధాలా సహకరించి షాదీముబారక్, మైనార్టీబంధు పథకాలు అందజేస్తున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలకులు అధికార దాహంతో తహతహలాడుతూ.. అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తారని, తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మైనార్టీలపై ప్రేమతో అత్యధిక నిధులు కేటాయించి షాదీఖాన, మసీదు, జెండాగద్దెలు, దర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలుపుతానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి, ప్రజా సంక్షేమ సర్కారును ఆశీర్వదించాలని కోరారు. అలాగే, రామ సురేందర్ ఆటో యూనియన్ నాయుడు పంపు అడ్డా నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు వారంతా శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నన్నపునేనిని కలిసి పుష్పగుచ్ఛం అందించి, వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వాగ్దానం చేశారు. సుమారు 70 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. అనంతరం ఉర్సుగుట్ట దీపావళి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే నరేందర్‌ను కలిసి నరకాసురవధకు హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఖిలావరంగల్: తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని బీఆర్ఎస్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ ప్రజలను కోరారు. శివనగర్‌లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్, సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నన్నపునేనికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేసి అభివృద్ధి చేయకుండా ఆగం చేసే చీడపురుగుల్లాంటి నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఒక పేద బిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ మారెట్, ఇన్నర్ రింగ్‌రోడ్, బస్‌స్టేషన్, రోడ్లు, డ్రైనేజీలు, 24 అంతస్తుల హాస్పిటల్, బస్తీ దవాఖాన, అండర్ గ్రౌండ్ డక్ట్, బండ్ అభివృద్ధి.. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు పుకార్లు, షికార్లు చేసినంత మాత్రాన బీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదని విమర్శించారు. మైనార్టీలంతా ఏకమై తనకు మద్దుతుగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆశీర్వదిస్తున్నారన్నారు. జకలొద్దిలో తనపై పూర్తి నమ్మకంతో ఎనిమిది వేల మంది తనకు మద్దతు తెలిపి బీఆర్ఎస్లో చేరారన్నారు. ఇప్పుడు వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కరోనా సమయంలో ఒకరు ఫాంహౌస్‌లో, మరొకరు పౌల్ట్రీఫాంలో ఉన్నారే తప్ప ప్రజల బాగోగులు చూడలేదని ఎద్దేవా చేశారు. ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ సీడ్స్ అసోసియేషన్‌కు తన అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు, డీలర్లు పాల్గొన్నారు. అలాగే, 34వ డివిజన్లో నన్నపునేని సమక్షంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలెపాక రాజు బీఆర్ఎస్లో చేరాడు. అలాగే, వరప్రసాద్, రఘు, రవితోపాటు సుమారు 60 కుటుంబాలు పార్టీలో చేరాయి. బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీలతతోపాటు 30 మందిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇందిర, మోహిని తదితరులు పాల్గొన్నారు.
ఖిలావరంగల్, నవంబర్ 7: బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు స్వచ్ఛంద సంస్థలు, పరపతి సంఘాలు, కుల సంఘాలు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్లోని ఎంఎంనగర్లో కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఎంఎంనగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేసిన నరేందరన్నకే మా ఓటు’ అని స్థానికులు ప్రకటించారు. అనంతరం రూ. 100 బాండ్ పేపర్‌పై ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. ‘ఎంఎంనగర్ నరేందరన్న అడ్డా.. ఇతర పార్టీలు ప్రచారానికి రావొద్దు’ అని బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎంఎంనగర్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, జీవో 58, 59 ద్వారా పట్టాలు అందజేసిన ఘనత ఎమ్మెల్యే నరేందర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, కాలనీ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, ఏలియా, రబ్బాని, సతీశ్, రంజిత్, గౌస్, రవి, సాంబరాజు, సంతోష్, జగన్, అరుణ, శ్రీనివాస్, జ్యోతి, సంధ్య, ఉమ, రాజు, రమేశ్, యాదగిరి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.