Mulugu | ములుగు జిల్లా మంగపేట మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోవడంతో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మొట్లగూడెం చెందిన రైతు యాలం నరసింహారావు(48) హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
మృతదేహాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించి నరసింహారావు కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించడంతోపాటు అతని కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు ఎకరాల సొంత పొలం తో పాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకొని వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన కారణంగా మంత్రి సీతక్క తన నియోజకవర్గానికి చెందిన నరసింహారావు కుటుంబానికి అండగా నిలవాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.