వరంగల్ : జిల్లాలో విషాదం చోటు చేకసుకుంది. బావిలో పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన నర్సంపేట మండలం ఇటుకీలపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో నీటమునిగి శ్రీనాథ్(14) అనే బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.