జయశంకర్ భూపాలపల్లి. డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ) : ఈ నెల 29న రాష్ట్ర మంత్రుల బృందం జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను సందర్శించింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖల మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు, రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు శుక్రవారం ఉదయం 11:30 గంటలకు హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు చేరుకుంటారు.
11:30 నుంచి ఒంటి గంట వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈఎన్సీ మురళీధర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డ్యామేజీపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలిస్తారు. అనంతరం భోజనం తరువాత 3 గంటలకు హెలీకాప్టర్‌లో అన్నారం బరాజ్‌కు వెళ్తారు. 3:20 గంటల నుంచి 4:20 గంటల వరకు బరాజ్‌ను పరిశీలించి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్తారు.