జనగామ, మే 13 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సోమవారం తెరపడింది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజవర్గాల్లో ప్రజలు ఓటేసేందుకు పోటెత్తారు. ఈసారి యువత, మహిళలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉ దయం 7 గంటల నుంచే బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు సాగిన ప్రక్రియ లో తొలి గంటలో పోలింగ్ మందకొడిగా ప్రా రంభమైంది. 9 గంటల నుంచి కేంద్రాల వద్ద జనం బారులుతీరి కనిపించారు. మునున్నడూ లేనివిధంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత, వృద్ధులు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వృద్ధులు, నడిచేందుకు సైతం యాతన పడే వృయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో కేంద్రాలకు తరలించి వారితో నేరుగా ఓటు వేయించారు.
అయితే జిల్లాలో పలు పో లింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించగా, కేంద్రాల్లో లైటింగ్ వసతి లేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోని 232 పోలింగ్ బూత్‌లో లైటింగ్ లేక ఈవీఎంలపై ఉన్న గుర్తులు కనిపించడం లేదని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో సిబ్బంది సెల్‌ఫోన్ లైటింగ్ నడుమ కొద్దిసేపు పోలింగ్ జరిపించారు. జనగామ, పెంబర్తి, గానుగుపహాడ్ సహా పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల నడుమ వాగ్వాదం జరిగింది. జనగామలోని ధర్మకంచ పోలింగ్ కేంద్రం ఆవరణలోకి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూ రి ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డిని అనుమతించడంపై స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసి ఏసీపీ, అర్భన్ సీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంతో పోలిస్తే ఈసారి పోల్‌చిట్టీలు, ఓటరు జాబితాలో తమ పేర్లు గల్లంతు వంటి ఫిర్యాదులు ఓటర్ల నుంచి రాలేదు. అధికార యంత్రాంగం ఓటు చైతన్యం, పోల్‌చిట్టీలు వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో ఓటుహక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. జనగామ నియోజకవర్గంలోని పలు కేంద్రాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని భువనగిరి ఎంపీ అభ్యర్ధి క్యామ మల్లేశం సందర్శించారు. పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా ఆ యన సతీమణి నీలిమ, కుమారుడు అనురాగ్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృ హం ప్రభుత్వ బాలికల పాఠశాల పోలింగ్ కేం ద్రం లో ఓటు వేశారు. జనగామ మండలం ఎల్లంలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌లో డాక్టర్ రాజయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా దం పతులు జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ కాలేజీ కేం ద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజ కవర్గాల్లో ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఉదయం 9గంటలకు జిల్లా వ్యాపితంగా మూ డు నియోజకవర్గాల్లో 11.36 శాతంగా నమో దైంది.11 గంటలకు 28.37శాతం, మధ్యా హ్నం 1 గంటకు 46.10 శాతం, 3 గంటలకు 61.39 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 71.11శాతం నమోదైతే.. ఎన్నికల సంఘం గం ట సమయం పెంచిన తర్వాత సాయంత్రం 6 గంటలకు జిల్లాలో 74.86 శాతం పోలింగ్ న మోదైంది. జనగామ సెగ్మెంట్లో 74.69 శా తం, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 78.54 శాతం, పాలకు ర్తిలో 71.35 శాతం పోలింగ్ నమోదైంది.
దేవరుప్పుల : మండలంలోని 32 గ్రామపంచాయతీల పరిధిలో 41 పోలింగ్ బూత్‌లు ఏర్పా టు చేయగా ఉదయం 11 గంటల వరకే 27 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 3 వరకు 65 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. యువ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధర్మాపురం, దేవరుప్పుల, కడవెండిలోని పో లింగ్ కేంద్రాల్లో పరిస్థితిని సమీక్షించి బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి కోలుకొండ, నీర్మాల, కడివెండిలో పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.
నర్మెట : మండలంలో 22 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ బూత్‌లకు వచ్చేలా వాహనాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు గద్దల పద్మ నర్సింగరావు దంపతులు వారి స్వగ్రామమైన గండిరామవరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనగామ డీసీపీ సీతారాంనాయక్ నర్మెట పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ సరళిని ఎస్సై శ్రీకాంత్ యాదవ్‌ను అడిగి తెలుసుకున్నారు.
దేవరుప్పుల : మండలంలోని 32 గ్రామపంచాయతీల పరిధిలో 41 పోలింగ్ బూత్‌లు ఏర్పా టు చేయగా ఉదయం 11 గంటల వరకే 27 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 3 వరకు 65 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. యువ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశా రు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధర్మాపురం, దేవరుప్పుల, కడవెండిలోని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని సమీక్షించి బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి కోలుకొండ, నీర్మాల, కడివెండిలో పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.
బచ్చన్నపేట : జడ్పీ చైర్పర్సన్ గిరబోయిన భా గ్యలక్ష్మి అంజయ్య దంపతులు మండలంలోని గోపాల్‌నగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కట్కూర్లో ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీకృష్ణంరాజు దంపతులు, బచ్చన్నపేటలో పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, నాగిరెడ్డిపల్లిలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ర మణారెడ్డి ఓటును వినియోగించుకున్నారు. మ ండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
లింగాలఘనపురం : మండలంలోని నవాబుపేట, సిరిపురంలో మాక్‌పోలింగ్ అనంతరం సాంకేతిక లోపం ఏర్పడి పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. 18 గ్రామపంచాయితీల పరిధిలో 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ సరళిని అడిషనల్ డీసీపీ సురేశ్, తహసీల్దార్ వినయలత, ఎంపీడీవో సలేందర్రెడ్డి, ఎంపీవో మల్లికార్జున్ ,ఎస్సై చింత రాజు పర్యవేక్షించారు.
రఘునాథపల్లి : మండలంలోని 36 గ్రామ పం చాయతీల పరిధిలో 56 పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేయగా ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. భారీ బందోబస్తు మధ్య ఓటర్లు తమ ఓటు హ క్కును వినియోగించారు. సాయంత్రం 5 గంట ల వరకు మండలంలో 75.94 శాతం పోలింగ్ నమోదైనట్లు తహసీల్దార్యుగేందర్ తెలిపారు.
స్టేషన్ ఘన్పూర్ : డివిజన్ కేంద్రంలోని 119 పోలింగ్ బూత్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హ క్కును వినియోగించుకున్నారు. మరోవైపు పోలింగ్ సరళని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా, వరంగల్ ఎంపీ అభ్యర్ది కడి యం కావ్య పరిశీలించారు. సమస్యాత్మక గ్రా మాలైన స్టేషన్ ఘన్పూర్, శివునిపల్లి, చాగల్లు, ఇప్పగూడెం, తాటికొండ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
తరిగొప్పుల : మండలంలోని పోలింగ్ ప్రశాం తంగా ముగిసింది. మొత్తం 15,717 మంది ఓటర్లుండగా వీరిలో 12,060 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 76.76 శాతం పోలింగ్ నమోదైంది. తరిగొప్పుల, భోజ్యతండాలో ఈవీఎంలు కొద్ది సేపు మొరాయించాయి.
జఫర్‌గఢ్ : మండలంలో 75.34 శాతం పోలిం గ్ నమోదైనట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. జఫర్‌గఢ్, రేగడితండా, షాపల్లి గ్రామాల్లో ఈవీ ఎంలు మొరాయించాయి. జఫర్‌గఢ్ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ సీపీ అంబర్‌కిశోర్‌ఝా సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు.
పాలకుర్తి రూరల్/ పాలకుర్తి : మండలంలోని మంచు ప్పులలో ఈవీఎం మొరాయించడంతో కొద్ది సేపు పోలింగ్ నిలిచింది. జనగామ డీసీపీ కే సీతారాం, వర్థన్నపేట ఏసీపీ అంబటి నర్స య్య, సీఐ గట్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పో లింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఆర్వో రోహిత్ సింగ్ పోలింగ్ సరళిని సమీక్షించారు. పాలకుర్తి, దర్దేపల్లి, ముత్తారం, మైలారం పోలింగ్ కేంద్రాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయన మా ట్లాడుతూ వరంగల్ ఎంపీ స్థానం బీఆర్ఎస్ కైవ సం చేసుకుంటుందన్నారు. మరోవైపు పారలకు ర్తి పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పరిశీలించారు.
కొడకండ్ల : మండలంలో 68 శాతం పోలిం గ్ నమోదైందని అధికారులు తెలిపారు. మండ లంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి ఎర్రబె ల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెలే యశస్వినీరెడ్డి పర్యటించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. రంగాపురంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించగా ‘మీరు స్థానికులు కాదు.. ఎన్ఆర్ఐ…’ అని స్థానికులు, బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.