సింగరేణి ఎన్నికలు ప్రశాంతం
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో బుధవారం జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఎన్నికల్లో మొత్తం 13 కార్మిక సంఘాలు పోటీ చేశాయి.
- భూపాలపల్లి ఏరియాలో 94.7 శాతం పోలింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న 5,123 మంది కార్మికులు
భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 27: భూపాలపల్లి సింగరేణి ఏరియాలో బుధవారం జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఎన్నికల్లో మొత్తం 13 కార్మిక సంఘాలు పోటీ చేశాయి. సింగరేణి యాజమాన్యం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,410 మందికి 5,123 కార్మికులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు 16.5 శాతం, 11 గంటలకు 53.2 శాతం, మధ్యాహం ఒంటి గంటకు 67.3 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 94.7 శాతం నమోదైంది.
కేటీకే -5 ఇైంక్లెన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు రెడ్ టీషర్ట్లు ధరించి వెళ్తుతుండగా పోలీసులు, ఐఎన్టీయూసీ నాయకులు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కేటీకే -2 ఇైంక్లెన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ నాయకులు కాంగ్రెస్ కండువాలు వేసుకొని వెళ్లగా పోలీసు అధికారులు వారిని అడ్డుకోగా వారి మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది. ఎస్పీ కిరణ్ ఖరే, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఐదుగురు బృందం ఎన్నికల సరళిని పర్యవేక్షించింది. 9 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. సాయంత్రం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 5 టేబుళ్లను ఏర్పాటు చేసి రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించి అర్ధరాత్రి వరకు ఫలితాలు తెలుపనున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

