కాశీబుగ్గ, ఫిబ్రవరి 10 : వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్ ఎరుపెక్కింది. మిర్చి యార్డుకు సోమవారం వేలాది బస్తాలు రావడంతో ఖరీదు వ్యాపారులు, అడ్తిదారులు, వివిధ కార్మిక వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ సీజన్ జనవరిలో మొదులు కాగా అత్యధికంగా సోమవారం 50వేల బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌కు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో మిర్చితో యార్డు నిండిపోయింది. కానీ ధరలు మాత్రం గతేడాదితో పోల్చితే ధరలు తక్కువ ఉన్నాయని రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలు నచ్చని రైతులు మరుసటి రోజు అమ్ముకునేందుకు మార్కెట్లోనే నిల్వ చేసుకుంటున్నారు.
సోమవారం తేజ మిర్చి 25,155 బస్తాలు రాగా ధరలు గరిష్టంగా రూ.13,400, మధ్యరకం రూ.12వేలు, కనిష్టంగా 10,500, వండర్‌హాట్ 1500 బస్తాలు రాగా అత్యధికంగా రూ.14,100, మధ్యరకం రూ.13వేలు, కనిష్టంగా రూ.11వేలు, యుఎస్-341 రకం మిర్చి 12వేల బస్తాలు రాగా అత్యధికంగా రూ.13,300, మధ్యరకం రూ.13వేలు, కనిష్టంగా రూ.11వేలు, దీపిక రకం మిర్చి 39 బస్తాలు రాగా గరిష్టంగా రూ.15,400, మధ్యరకం రూ.14వేలు, కనిష్టంగా రూ.10వేలు, దేశీరకం మిర్చి 3 బస్తాలు రాగా ధర రూ.15,012, 1048 రకం మిర్చి 867 బస్తాలు రాగా గరిష్టంగా రూ.12,500, మధ్యరకంగా రూ.11,500, కనిష్టంగా రూ.9వేలు, డీడీలు 97బస్తాలు రాగా గరిష్టంగా రూ.12,500, మధ్యరకం రూ.11వేలు, కనిష్టంగా రూ.10వేలు, తాలు మిర్చి 32,24 బస్తాలు రాగా గరిష్టంగా రూ7వేలు, మధ్యరకంగా రూ.5,500, కనిష్టంగా రూ.3,500 పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.