హనుమకొండ, మే 11 : బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్ 30వేల పైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, అభ్యర్థి సుధీర్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మోస పూరిత హామీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి, మళ్లీ ఆగస్టు 15వ తేదీ వరకు గడువు పెట్టి మరోసారి రైతులను మోసం చేయాలని చూ స్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఏ దవాఖానలో ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని, కల్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వలేదని చెప్పారు. ధైర్యం ఉంటే కడియం ఎ మ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అరూరి అవినీతిపరుడు, భూ కబ్జాకోరు అని విభజన చట్టంలో ఒక్క హామీనీ అమలుచేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు.
అవినీతి, అణచివేతకు బ్రాండ్ కడియం..
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అవినీతికి, అణచివేతకు బ్రాండ్ కడియం శ్రీహరి అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉందన్నారు. కడియం మాదిగ జాతిని అడ్డుపెట్టుకుని పదవులు పొంది అదే జాతిని అణగదొక్కాడన్నారు. అరూరి, కడియం గురుశిష్యులని, వీరు చీకటి ఒప్పందం కుదుర్చుకుని ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒప్పందం చేసుకొంటే ఈటలను ఓడించింది ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పుచేతల్లో నడుస్తున్న చోటేభాయ్ రేవంత్‌రెడ్డి, బడేభాయ్ మోదీ బీఆర్ఎస్పై, కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్రీహరికి ఈ ఎన్నికలతో రాజకీయ సమాధి తప్పదన్నారు.
ద్రోహులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం ; ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్
వరంగల్‌లో ఓటమి భయంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వరంగల్‌లో పర్యటించారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్ధన్‌గౌడ్, కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, తదితరులు పాల్గొన్నారు.