ఖిలావరంగల్: వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా 25.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా సంగెం మండలంలో 72.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే గీసిగొండలో 40.4 మిల్లీమీటర్లు, చెన్నారావుపేటలో 34.2 మిల్లీమీటర్లు, నెక్కొండలో 54.2 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్లో 36.2 మిల్లీమీటర్లు, వరంగల్లో 54.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపూర్, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో తేలికపాటి వర్షం పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న ఐదు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.