ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కృషి

- వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, జనవరి 16 : ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఉదయం దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్‌పై ప్రధాని మోడీ సందేశాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వైద్యులతో కలిసి విన్నారు. అనంతరం దవాఖానలో వైద్యులతో కలిసి వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సారంగపాణికి మొదటి టీకా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ ప్రజలు ఏడాదిగా కరోనాతో అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కరోనా నిర్మూలన కోసం వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు. వైద్యుల సూచనల మేరకు ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. దశల వారీగా పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ వ్యాక్సిన్ అందుతుందన్నారు. అనంతరం వర్ధన్నపేట సమీపంలో జఫర్‌గఢ్-వర్ధన్నపేట రహదారి పక్కన ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు. ప్రకృతి వనాల్లో మొక్కలను సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేందర్‌జీ, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ పాల్గొన్నారు.
హసన్‌పర్తిలో వ్యాక్సినేషన్ ప్రారంభం
హసన్‌పర్తి : మండలంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా టీకాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతపాక సునీత, జడ్పీటీసీ సునీత, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్ పాల్గొన్నారు.