బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Dec 15, 2020 , 00:45:25

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

పరకాల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన జరుగుతున్నదని హైబోత్‌పల్లి సర్పంచ్‌ కంచె కుమారస్వామి అన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం అందించిన స్కూల్‌ డ్రెస్సులను సోమవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్‌ 

మాట్లాడుతూ.. ప్రాథమిక దశలోనే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ సంపత్‌, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌ పద్మ, ఉపాధ్యాయురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

స్కూల్‌ డ్రెస్సుల పంపిణీ..

పరకాల (శాయంపేట) : మండలంలోని పెద్దకోడెపాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన స్కూల్‌ డ్రెస్సులను సర్పంచ్‌ అబ్బు ప్రకాశ్‌ రెడ్డి పంపిణీ చేశారు. సోమవారం పాఠశాలలో 9,10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్సులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు రాణించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చందన, సురేశ్‌, చంద్రయ్య, వాసుదేవ్‌, రాజిరెడ్డి, రంగారెడ్డి పాల్గొన్నారు.

సంగెంలో..

సంగెం : మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లను ఎంపీపీ కందకట్ల కళావతి పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రవీందర్‌, సర్పంచ్‌ గుండేటి బాబు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఎన్‌ నాగరాజు, ఉపాధ్యాయులు శ్యాం, విద్యాసాగర్‌, రాజు, చలం పాల్గొన్నారు.

పర్వతగిరిలో..

పర్వతగిరి : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, స్టడీ మెటీరియల్‌ను సర్పంచ్‌ మాలతి, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ మెంబ ర్‌ మహ్మద్‌ సర్వర్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాడుగుల రాజు, బొట్ల మహేంద్ర, ఉప సర్పంచ్‌ జనార్దన్‌, 

ప్రధానోపాధ్యాయుడు జలీల్‌ పాల్గొన్నారు. logo