రాయపర్తి, ఏప్రిల్ 6: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం జయరాంతండా(ఎస్) గ్రామ పంచాయతీ పరిధిలోని పలు తండాల కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరగా, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల చైర్మ న్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
రేవంత్ సర్కారు 15 నెలల కాలంలో అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు వలస వస్తున్నారని పరుపాటి అన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిని తాము కంటికిరెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, లేతాకుల రంగారెడ్డి, భూక్యా సురేందర్, రాథోడ్నాయక్, పూస మధు, కర్ర రవీందర్‌రెడ్డి, సంది దేవేందర్‌రెడ్డి, కోల సంపత్, అయిత రాంచందర్, చందు, రామ్‌యాదవ్, చిలువేరు సాయిగౌడ్, జీ ప్రసాద్, ఏ శ్రీనివాస్‌రెడ్డి, టీ సంతోష్‌గౌడ్ పాల్గొన్నారు.