కాశీబుగ్గ, సెప్టెంబర్ 5 : నగరంలోని కాశీబుగ్గలో సోమవారం భద్రకాళీ పరపతి సంఘం ఆధ్వర్యంలో 1116 కిలోల భారీ లడ్డూ తయారు చేశారు. గణపతి నవరాత్రుల సందర్భంగా మహా ప్రసాదం తయారు చేసినట్లు నిర్వాహకుడు గుల్లపెల్లి రాజ్‌కుమార్ తెలిపారు.
సాయంత్రం డప్పు చప్పుళ్లు, ప్రత్యేక నృత్యాలతో ఊరేగింపు నిర్వహించి గణపతికి మహాప్రసాదం అప్పగించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, ఓని స్వర్ణలత, మాజీ కార్పొరేటర్ బయ్యా స్వామి, నిర్వాహకులు గోరంట్ల మనోహర్, వేముల నాగరాజు, మాటేటి విద్యాసాగర్, ఓం ప్రకాశ్ కొలారియా, మండల శ్రీరాములు, వడిచెర్ల సదానందం, ములక సురేశ్ పాల్గొన్నారు.