నర్సంపేట, జనవరి 19 : ప్రపంచ స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మానవీయ కోణంలో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికే మొదటి విడుతలో వందశాతం మందికి కంటి పరీక్షలు చేయించి మందులు, అద్దాలు, ఆపరేషన్లు చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి దగ్గరుండి ఆపరేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 1099 క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 100 రోజుల పాటు నిర్విరామంగా క్యాంపులు ఉంటాయని, ప్రతి రోజూ పట్టణంలో 400 మందికి, గ్రా మంలో రెండు వందల మందికి పరీక్షలు చేస్తారని చెప్పా రు. దృష్టి లోప అధికంగా ఉన్న వారి వివరాలను వైద్యు లు ఆన్లైన్లో నమోదు చేస్తారని, వారి ఇంటికి ఆయా కంపెనీల నుంచి నేరుగా కంటి అద్దాలు పంపిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఆర్డీవో శ్రీనివాసులు, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, రైతు బంధు సమితి సభ్యుడు రాయిడి రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, పట్టణ యూత్ అధ్యక్షుడు రాయిడి దుశ్యంత్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, కమిషనర్ వెంకటస్వామి, వైద్యాధికారి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఇటుకాలపల్లి, భాంజీపేట గ్రామాల్లో కంటి వెలుగు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇటుకాలపల్లిలో కేంద్రా న్ని ఎమ్మెల్యే పరిశీలించారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వైద్యులు, అధికారులకు పలు సూచనలు చేశారు. 18ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్ కు రావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్యా వీరన్న, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి, గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి : కంటి వెలుగు.. ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మేడపల్లి, నల్లబెల్లిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించారు. మేడపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో 15 కేంద్రాల్లో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీత, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్, మండల స్పెషలాఫీసర్, డీటీడీవో జహీరుద్దీన్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత, మేడపల్లి, నల్లబెల్లి, రాంపూర్ గ్రామాల సర్పంచ్‌లు లావుడ్యా తిరుపతినాయక్, రాజారాం, సురేశ్, ఎంపీటీసీలు జయరావు, అంజలి, వైద్యాధికారి శశికుమార్, పీఏసీఎస్ చైర్మన్ మురళీధర్‌రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, వైస్ చైర్మన్ మోహన్‌రావు, నాయకులు గందె శ్రీనివాస్‌గుప్తా, మోహన్ తదితరులు పాల్గొన్నారు.