నర్సంపేట, మార్చి 8: రాష్ట్రంలోని అతివలకు టీఆర్ఎస్ సర్కార్ చేయూతనిస్తున్నదని, మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని 128 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. 1.28 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, మహిళా సంఘాలకు రుణాలు తదితర పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, నర్సంపేట ఆర్డీవో పవన్‌కుమార్, తాసిల్దార్ రామ్మూర్తి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేటలో పవన్ నర్సింగ్‌హోం, ఓమెగా బన్ను దవాఖానల వైద్యులు లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బన్ను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేశారు. డాక్టర్ విద్య, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ పాల్గొన్నారు. అంతేకాకుండా నర్సంపేటలో పట్టణ, మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, గుడిపూడి అరుణ, నల్లా భారతి, దార్ల రమాదేవి పాల్గొన్నారు. అలాగే, పట్టణంలోని పాకాల మహిళా బ్యాంకు ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. శివానంద్, ఎద్దునూరి రమేశ్ పాల్గొన్నారు. స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యదర్శి జెజ్జంకి ప్రభాకర్ పాల్గొన్నారు. జనసేనా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించా రు. సీపీఐ ఆధ్వర్యంలో, భారత జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. నర్సంపేట ఏరియా దవాఖానలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపి ణీ చేశారు. పారిశుధ్య కార్మికులు, వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సన్మానించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఖానాపురం/దుగ్గొండి/చెన్నారావుపేట: మహిళలు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్తే అనుకున్నది సాధిస్తారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఐనపల్లిలో మహిళలకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఆకుట్టుకుంది. 40 ఏళ్ల పైబడిన మహిళలు పాల్గొని అబ్బురపరిచారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, ఎంపీపీ ప్రకాశ్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటనర్సయ్య, సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గొండిలో ప్రశాంతి మహిళా సమాఖ్య, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను పెద్ది ప్రారంభించారు. ఎంపీడీవో కృష్ణప్రసాద్, తాసిల్దార్ సంపత్‌కుమార్, ఎస్సై నవీన్‌కుమార్, ఎన్నారై రాజ్‌కుమార్, సర్పంచ్ మంజులానర్సింహారెడ్డి, ఎంపీటీసీ రాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని సిద్ధార్థ గురుకుల హైస్కూల్లో నిర్వహించిన మండలస్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం మహిళా ప్రతినిధులను సత్కరించారు. తర్వాత మండలకేంద్రానికి ఆటో డ్రైవర్ ముదురు కల్యాణ్ మరణించగా, అతడి భార్య లావణ్య, కుమారుడు, కూతురు దీనావస్థలో ఉండడాన్ని టీఆర్ఎస్ నాయకుడు కంది కష్ణచైతన్యారెడ్డి ద్వారా తెలుసుకున్నారు. ఈ మేరకు కల్యాణ్ కుటుంబానికి ఎమ్మెల్యే రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. అలాగే, కుటుంబాన్ని ధైర్యంగా నెట్టుకొస్తున్న ఆమెను పెద్ది సత్కరించారు. డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. జడ్పీటీసీ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు గఫార్, సిద్ధార్ధ విద్యాసంస్థల చైర్మన్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ/నల్లబెల్లి: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఐకేపీ భవన నిర్మాణానికి రంగం సిద్ధమైందని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. నెక్కొండలోని విద్యోదయ ఉన్నత పాఠశాలలో క్రీడల ముగింపు సమావేశం జరిగింది. మహిళలు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పెద్ది అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్, నెక్కొండ, సూరిపల్లి సొసైటీ చైర్మన్లు రాము, దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సూరయ్య, ఎస్సై సీమ ఫర్హీన్, ఐకేపీ ఏపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లిలోని మదర్‌థెరిస్సా మండల సమాఖ్య ఆధ్వర్యంలో కారుణ్య జ్యోతి పాఠశాలలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారంగపాణి, సర్పంచ్‌లు రాజారాం, గోనె శ్రీదేవి, మామిండ్ల మోహన్‌రెడ్డి, ఊరటి అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.