e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు ప్రాణవాయువుకు ఢోకాలేదిక

ప్రాణవాయువుకు ఢోకాలేదిక

ప్రాణవాయువుకు ఢోకాలేదిక

ఎంజీఎంకు ఆక్సిజన్‌ తయారీ ప్లాంటు
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిధులు మంజూరు
శాశ్వతంగా తీరనున్న సమస్య
భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా చర్యలు
నిర్మాణానికి ప్రస్తుత ప్లాంట్‌ వద్ద స్థల పరిశీలన

వరంగల్‌ చౌరస్తా, మే 25: వరంగల్‌ ఎంజీఎం దవాఖానలో ఆక్సిజన్‌ సమస్యను తీర్చేందుకు ప్రభు త్వం చేపట్టిన చర్యలతో పరిష్కారం లభించింది. దవాఖానతో పాటు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. కరోనా బాధితులకు వైద్యసేవలు అందించడంలో కీల కమైన ఆక్సిజన్‌ సమస్యను అధిగమించేందుకు చర్య లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నిల్వ చేసి ప్లాంట్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా వివిధ విభాగాలకు సరఫరా చేస్తున్నారు. ఆక్సిజన్‌ భారీగా నిల్వ చేసుకునే వెసులు బాటు లేకపోవడంతో ఉత్పత్తి చేస్తూ వినియోగించు కునేందుకు అధికారులు ఉత్పత్తి ప్లాంట్‌ నిర్మించను న్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్రం తెలంగాణ కు అనుమతించిన ఐదు ప్లాంట్లలో ఒకటి ఎంజీఎంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్ర మంలో మంగళవా రం ప్రస్తుతం నిల్వ ప్లాంట్‌ ఉన్న స్థలంలోనే అధునా తన టెక్నాలజీని వినియోగించి వెయ్యి లీటర్ల సామ ర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ తయారీ ప్లాంటు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. నూతనంగా నిర్మించనున్న ప్లాంట్‌ ప్రతి గంటకు ఆరు వందల లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి సామర్థ్ధ్యంతో పనిచేస్తుందని, ఎక్కువ పీడనం తో సరఫరా చేసేందుకు వీలుంటుందని అధికా రులు తెలియజేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి, అధిక ఒత్తిడితో సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉండడం మూలంగా పీఎం కేర్‌ నుంచి అందిన హైఫ్లోనాజిల్‌ వ్యవస్థతో కూడిన వంద వెంటిలేటర్లు కరోనా విభాగానికి అందుబాటు లోకి రానున్నాయి. దీంతో ఎంజీఎం కొవిడ్‌ విభా గంతోపాటుగా ఎంజీ ఎంలో అందుబాటులో ఉన్న అన్ని ఆపరేషన్‌ థియేట ర్లకు నాణ్యమైన ఆక్సి జన్‌ సర ఫరా జరుగ నుంది. ప్రస్తుతం కరోనా కారణంగా వెంటిలేటర్ల వినియో గానికి అవసరమైనంత ఆక్సిజన్‌ నేరుగా ఉత్పత్తి చేసు కోవడంతో పాటుగా భవిష్యత్‌ అవసరాలకు సైతం వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రాణవాయువుకు ఢోకాలేదిక

ట్రెండింగ్‌

Advertisement