తానూర్, జూలై 9 : చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మండలంలోని బెల్‌తరోడా చెక్‌పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. పశువుల అక్రమ రవాణా సమయంలో ఆరోగ్య, రవాణా శాఖల అనుమతి పత్రాలు పరిశీలించాలన్నారు. ఎలాంటి పత్రాలు లేకపోతే అనుమతించకూడదని పేర్కొన్నారు. అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. పశువుల రవాణాపై ఎలాంటి సమాచారం తెలిసినా పోలీస్‌స్టేషన్‌లో గానీ, డయల్ 100, కంట్రోల్ రూం నంబర్ 8333986939కు అందించాలని కోరారు. ఈయన వెంట ఎస్ఐ గుడిపెల్లి రాజన్న ఉన్నారు.
సోన్, జూలై 9 : సారంగాపూర్ తదితర ప్రాంతాలతో పాటు చెక్‌పోస్టులను ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాలను నిరంతరం తనికీ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. పశువైద్యాధికారి ఇచ్చే ఆరోగ్య, వాణాశాఖ అనుమతి ఉన్న పశువుల రవాణాకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించారు.