బుధవారం 03 మార్చి 2021
Warangal-city - Jan 23, 2021 , 00:11:44

‘పల్లె ప్రగతి’తో సత్ఫలితాలు

‘పల్లె ప్రగతి’తో సత్ఫలితాలు

  • అద్దంలా గ్రామాలు
  • పారిశుధ్య నిర్వహణ మెరుగు
  • కార్యక్రమ అమలులో రాష్ట్రంలోనే రూరల్‌ జిల్లా అగ్రస్థానం
  • చిట్ట చివరన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ అద్భుత ఫలితాలు ఇస్తున్నది. పచ్చదనం, స్వచ్ఛతతో ప్రతి ఊరూ అద్దంలా కనిపిస్తున్నది. పారిశుధ్య నిర్వహణ పక్కాగా అమలవుతుండడంతో ప్రజలకు సీజనల్‌ వ్యాధుల బెడద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుటికప్పుడు తనిఖీలు చేయిస్తూ గ్రామాలకు, వాటి పరిస్థితుల ఆధారంగా జిల్లాలకు ‘పారిశుధ్య మార్కులు’ కేటాయిస్తుండడంతో అధికారుల్లో జవాబుదారీతనం పెరిగింది. మూడు నెలల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, నవంబర్‌, డిసెంబర్‌లో వరంగల్‌ రూరల్‌ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అత్యల్ప మార్కులతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది.

  • ‘ప్రగతి’ మెరిసే.. పల్లె మురిసే
  • ‘పల్లె ప్రగతి’తో సత్ఫలితాలు
  • అద్దంలా గ్రామాలు
  • పారిశుధ్య నిర్వహణ మెరుగు
  • కార్యక్రమ అమలులో రాష్ట్రంలోనే రూరల్‌ జిల్లా అగ్రస్థానం
  • చిట్ట చివరన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

వరంగల్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ మంచి ఫలితాలు ఇస్తున్నది. కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో నిత్యం పర్యవేక్షిస్తుండడంతో ఊళ్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయి. పారిశుధ్య నిర్వహణ మెరుగై ప్రజలకు సీజనల్‌ వ్యాధుల బెడద తప్పింది. ‘పల్లె ప్రగతి’లో ముఖ్యంగా పారిశుధ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండడం, ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండడంతో అధికారుల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఊర్లను స్వచ్ఛంగా మార్చుకోవడంపైనే ప్రధానం గా దృష్టి పెడుతున్నారు. తనిఖీల ఆధారంగా గ్రామాల కు, గ్రామాల పరిస్థితుల ఆధారంగా జిల్లాలకు ప్రభు త్వం పారిశుధ్య మార్కులు ఇస్తున్నది. వీటిలో అత్యధికంగా 40 మార్కులు నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో తనిఖీలు చేసిన గ్రామాల పరిస్థితుల ఆధారంగా ప్రతినెలా మార్కులు కేటాయిస్తున్నది. మూడు నెలల క్రితం ఈ ప్రక్రియను ప్రారంభించింది. నవంబర్‌, డిసెంబర్‌లో పారిశుధ్య మార్కుల పరంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో వరంగల్‌ రూరల్‌ జి ల్లాలకు 38 మార్కులు వచ్చాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మాత్రం పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది. రెండు నెలల క్రితం చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఈ జిల్లా గత నెలలో అట్టడుగుకు చేరింది. గత నెలలో ఈ జిల్లాకు 25 మార్కులే వచ్చాయి. వరంగల్‌ అర్బన్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలు సైతం మార్కుల పరంగా కొంత వెనక్కి వెళ్లాయి. ‘పల్లె ప్రగతి’ అమలు, నిరంతర పర్యవేక్షణ కోసమే గ్రామాల్లో మెరుగైన పరిస్థితుల ఆధారంగా పంచాయతీరాజ్‌ శాఖ మార్కులు నిర్ణయిస్తున్నది. క్షేత్రస్థాయి వివరాల ప్రకా రం ఎప్పటికప్పుడు వీటిని మార్చుతున్నది.  

సర్కారు ముందుచూపు..

గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2019 సెప్టెంబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 5 వరకు మొదటి విడుత, 2020 జనవరి 2 నుం చి 12 వరకు రెండో విడుత ‘పల్లె ప్రగతి’ చేపట్టారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. పల్లె ప్రగతి ఎక్కువగా గ్రామాల్లో విజయవంతమైంది. పచ్చదనంతోపాటు పారిశుధ్య నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాం కర్లను సమకూర్చుకునేలా ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీ ట్రాక్టర్ల వినియోగంతో పరిశుభ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ‘పల్లె ప్రగతి’లో చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నది. పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించే గ్రామ కార్యదర్శులు గతంలో తక్కువ ఉండేవారు. ఒక్కో కార్యదర్శికి మూడు నాలుగు గ్రామాలుండేవి. ప్రతి పంచాయతీకో కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోనే దాదాపు వెయ్యి పోస్టులను భర్తీ చేసింది. పారిశుధ్య నిర్వహణలో  కార్మికులే కీలకం కాగా వారి వేతనాన్ని రూ.8,500కు పెం చింది. దీంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగైంది. 

VIDEOS

logo