గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Sep 26, 2020 , 02:33:21

సివిల్స్‌ పరీక్షా కేంద్రాల రూట్‌ ట్రయల్‌ రన్‌

సివిల్స్‌ పరీక్షా కేంద్రాల రూట్‌ ట్రయల్‌ రన్‌

హన్మకొండ, సెప్టెంబర్‌ 25 : సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్‌ 4వ తేదీన జరుగనున్న నేపథ్యంలో రూట్‌, పోలీస్‌ అధికారులు శుక్రవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. డీసీపీ కే పుష్ప, డీఆర్‌వో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుంచి ఒక్కో కేంద్రానికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అంచనా వేశారు. ఆయా రూట్లలో బందోబస్తు కోసం నియమించిన పోలీస్‌ అధికారులతో కలిసి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష జరిగే రోజు ప్రశ్న పత్రాలను కేంద్రాలకు చేరవేయడంలో ఆలస్యం కాకుండా చూసేందుకు ఈ రూట్‌ వాచ్‌ నిర్వహించామని అధికారులు తెలిపారు. ఏసీపీలు రవీందర్‌, జితేందర్‌రెడ్డి, ప్రతాప్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో విజయలక్ష్మి పాల్గొన్నారు. 


logo