బంగ్లాదేశ్‌లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి
బంగ్లాదేశ్‌లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి | రెండు పడవలు ఢీకొట్టుకున్న ఘటనలో 25 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఈ సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని పద్మ నది వద్ద చోటు చేసుకుంది.

ఢాకా : రెండు పడవలు ఢీకొట్టుకున్న ఘటనలో 25 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఈ సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని పద్మ నది వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో ఐదుగురిని రక్షించామని, 25 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీస్ చీఫ్ మిరాజ్ హుస్సేన్ తెలిపారు. షిబ్‌చార్ పట్టణానికి సమీపంలోని పద్మ నదిలో సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవను ఇసుక రవాణా చేస్తున్న ఓడ ఢీకొట్టింది.
విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించి, పలువురిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా ఎక్కువ మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. బంగ్లాలో పడవ ప్రమాదాలు సర్వ సాధారణం. పేలవమైన నిర్వహణ, షిప్‌యార్డుల వద్ద భద్రతా ప్రమాణాల లేమి, రద్దీ సైతం ప్రమాదాలకు కారణమని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభంలోనూ సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవను పెద్ద కార్గో ఓడ ఢీకొట్టింది. గతేడాది జూన్‌లో ఫెర్రీ మునిగిపోయి 32 మంది మరణించారు. 2015 ఫిబ్రవరిలో కార్గో బోటును ఢీకొట్టడంతో కనీసం 78 మంది మరణించారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 21-10-2023 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

