మయన్మార్‌లో ఆర్మీ అణచివేత: సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి
మయన్మార్‌లో ఆర్మీ అణచివేత విధానం కొనసాగుతున్నది. సైన్యం కాల్పుల్లో ఆదివారం నాడు 8 మంది చనిపోయారు

నెపేటా : మయన్మార్‌లో ఆర్మీ అణచివేత విధానం కొనసాగుతున్నది. సైన్యం కాల్పుల్లో ఆదివారం నాడు 8 మంది చనిపోయారు. దేశంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్పై నిషేధం విధించారు. పలు వార్తా ఛానళ్లను తమ ఆధీనంలోకి తీసుకుని నడిపిస్తున్న ఆర్మీ.. ఇప్పటివరకు 48 మంది జర్నలిస్టులను కూడా అరెస్టు చేశారు
మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలను సైన్యం ఎక్కడికక్కడ అణచివేస్తున్నది. సైన్యం జరిపిన కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మరణించారు. ప్రజలు సైన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుండటంతో సైన్యం అడ్డుకున్నది. సైన్యాన్ని దాటుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో సైనిక బలగాలు కాల్పులు జరిపారు. సైన్యం విధానాలకు వ్యతిరేకంగా యాంగోన్, మాండలే నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి. వైట్లెట్ పట్టణంలో ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపినట్లు స్థానిక మీడియా తెలిపింది. అదే సమయంలో, షాన్ రాష్ట్రంలోని మురికివాడలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
పోలీసు బ్యారక్స్ వెలుపల బాంబు పేలుడు
ఆదివారం యాంగోన్లోని పోలీసు బ్యారక్స్ వెలుపల బాంబు పేలుడు జరిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా పేలుడు సంఘటనలు జరిగాయి. ఇప్పటివరకు దేశంలో జరుగుతున్న వివిధ ప్రదర్శనల్లో 759 మంది ప్రాణాలు కోల్పోయారని ఆస్టిటెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ (ఏపీపీపీ) తెలిపింది.
సోషల్ మీడియాపై నిషేధం
సైన్యం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను నిషేధించడంతో పాటు సమాచారాన్ని నియంత్రించడం ప్రారంభించింది. సైన్యం 48 మంది జర్నలిస్టులను అరెస్టు చేసింది. తర్వాత 23 మందిని వదిలేసింది. అనేక స్వతంత్ర మాధ్యమాలను కూడా నిషేధించారు. ఇక్కడి జుంటా ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్‌లను నిషేధించారు. సైన్యమే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను స్వయంగా నియంత్రిస్తున్నది. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్నెట్పై గంటల నిషేధం ఉండగా.. గత నెల 15 నుంచి మొబైల్ ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి..
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆన్లైన్లో 60 మంది వైద్యులు.. వివిధ భాషల్లో సేవలు
అద్వానీ రథయాత్ర కారకుడు ప్రమోద్ మహాజన్.. చరిత్రలో ఈరోజు
లాక్డౌన్ తరహా ఆంక్షలు పొడగించిన పంజాబ్ ప్రభుత్వం
ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం
బంగ్లాదేశ్‌లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 44 మందికి ఉద్యోగాలు
సంస్కరణల పేరిట విద్యార్థుల భవిష్యత్‌తో ప్రయోగాలా?
సారపాకలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీకి వినతి
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

