ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Jun 08, 2020 , 02:21:41

సీజనల్‌ వ్యాధులపై అవగాహన

సీజనల్‌ వ్యాధులపై అవగాహన

హన్మకొండ, జూన్‌ 07: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 31వ డివిజన్‌లోని హంటర్‌రోడ్డు టైగర్‌హిల్స్‌కాలనీలో  వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ ర్యాలీ నిర్వహించి సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇళ్లలో చెత్తాచెదారం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భం గా కాలనీలో పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నయీమొద్దీన్‌, ఏఈ సౌజన్య, కాలనీ వాసులు బుర్ర సుధాకర్‌, అంబయ్య, రమేశ్‌, రాజమల్లు, శ్రీనివాస్‌, స్వామి, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.


logo