శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 14, 2020 , 11:37:27

రుణాలు వందశాతం వసూలు చేయాలి

రుణాలు వందశాతం వసూలు చేయాలి

 జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి ఇచ్చిన రుణాలను ఈ నెలాఖరు వరకు వందశాతం వసూలు చేయాలని డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు బ్యాంకు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ అదాలత్‌ డీసీసీబీ కార్యాలయంలో 2019-2020 వార్షిక సంవత్సర బ్యాంకు రుణాల రికవరీపై అధికారులతో సమీక్షించారు. బ్యాంకు పరిధిలోని 19 బ్రాంచ్‌ల వారీగా ఎల్‌టీ, గోల్డ్‌ లోన్లు, ఇతర కమర్షియల్‌ లోన్ల వసూళ్లు, పెండింగ్‌ లోన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుపై ఖాతాదారులకు, ముఖ్యంగా రైతులపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన ప్రతి లోన్‌ను సకాలంలో వసూలు చేసి బ్యాంకు పురోగతికి పాటుపడాలని చైర్మన్‌, బ్రాంచ్‌ మేనేజర్లకు సూచించారు. మెండిబకాయిలపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించిన లోన్లను ఈనెల చివరి వారంలోగా రికవరీ చేయాలని సూచించారు. బ్రాంచ్‌ అధికారులు, సిబ్బంది సమష్టిగా పని చేయాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. రానున్న రోజుల్లో ఎల్‌టీ లోన్లు, కమర్షియల్‌ లోన్లు ఇవ్వడానికి బ్రాంచ్‌ల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, గతంలో కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఇప్పుడు అలా చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. పాలక మండలి, అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా అంకితభావంతో పనిచేసి బ్యాంకును అభివృద్ధి బాటలో నడిపిద్దామని చైర్మన్‌ రవీందర్‌రావు సూచించారు. సమావేశంలో బ్యాంకు సీఈవో అంజయ్య, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ వాల్వానాయక్‌, డీజీఎం అశోక్‌, ఏజీఎంలు, 19 బ్రాంచ్‌ల బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. 


logo