e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జనగాం మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలి

మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలి

మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలి

మెగా పార్కు ఏర్పాటుకు కృషి చేయాలి
అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌

నర్సంపేట/చెన్నారావుపేట, జూలై 14: మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌ అన్నారు. మండలంలోని రామా రం గ్రామాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. గ్రామ శివారులో సర్పంచ్‌ కోడూరి రవితో కలిసి మొక్కలు నాటారు. పల్లెలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని సర్పంచ్‌లకు సూచించారు. చెన్నారావుపేటలోని కోపాకుల చెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను హరిసింగ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పాటుకు 10 ఎకరాల స్థలం అవసరం కాగా, చెరువు సమీపంలో ఏడెకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పని చేసి మెగాపార్కు ఏర్పాటునకు కృషి చేయాలని కోరారు. అనంతరం అమృతండా, వాయిల్‌తండా, పత్తినాయక్‌తండా, అక్కల్‌చెడను సందర్శించి సర్పంచ్‌లకు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఫూల్‌సింగ్‌చౌహాన్‌, ఎంపీవో సురేశ్‌, సర్పంచ్‌లు కుండె మల్లయ్య, జాటోత్‌ స్వామినాయక్‌, తూటి పావని, ఆంగోత్‌ అరుణ, బోడ వెంకన్న, శాంతి, ఏపీవో అరుణ, ఈసీ కిశోర్‌, గిర్దావర్‌ స్వామి పాల్గొన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించాలి
పర్వతగిరి/సంగెం: హరితహరంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని డీఆర్డీవో సంపత్‌రావు సూచించారు. కొంకపాకలో ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటారు. నాటిన మొక్కలకు రక్షణగా రెండు మీటర్ల ఎత్తులో ట్రీగార్డులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కొంకపాకలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో మెగా పార్కు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీడీ సాయిచరణ్‌, తహసీల్దార్‌ మహబూబ్‌ అలీ, ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్‌, ఎంపీవో మధుసూదన్‌, ఏపీవో సుశీల్‌కుమార్‌, సర్పంచ్‌ వర్కాల రమేశ్‌, ఎంపీటీసీ మోహన్‌రావు, ఉపసర్పంచ్‌ రంజిత్‌కుమార్‌, జీపీ కార్యదర్శి హుస్సేన్‌, ఈసీ ప్రవీణ్‌, రాజేందర్‌ పాల్గొన్నారు. కాగా, కొంకపాక శివారులోని సర్వే నంబర్‌ 213లో ఉన్న 10 ఎకరాల అసైన్డ్‌ భూమిని బృహత్‌ ప్రకృతి వనం కోసం కేటాయించి మొక్కలు నాటుతుండగా పలువురు రైతులు అభ్యంతరం తెలిపారు. ఎవరైనా నాటిన మొక్కలను తొలగిస్తే కేసులు నమోదు చేస్తామని డీఆర్డీవో హెచ్చరించారు. సంగెం మండలం తీగరాజుపల్లిలో మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను డీఆర్డీవో సంపత్‌రావు పరిశీలించారు. తీగరాజుపల్లి నుంచి గాంధీనగర్‌, తిమ్మాపురం, సంగెం మీదుగా ఊకల్‌ వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డుకిరువైపులా రెండు మూడు వరుసల్లో మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ సాయిచరణ్‌, ఎంపీడీవో ఎన్‌ మల్లేశం, ఏపీవోఓ లక్ష్మి, సర్పంచ్‌ కర్జుగుత్త రమాగోపాల్‌, ఎంపీటీసీ రంగరాజు నర్సింహస్వామి, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ: మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొక్కలు నాటి రక్షిస్తే పాఠశాలలు హరితవనాలుగా తయారవుతాయని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, కార్పొరేటర్‌ ఆకులపల్లి మనోహర్‌ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ 15వ డివిజన్‌లోని గొర్రెకుంట ప్రభుత్వ పాఠశాలలో యునెస్కో ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో యునెస్కో కార్యదర్శి రాజగోవింద్‌, పీఆర్టీయూ నాయకులు అశోక్‌, రామయ్య, ఉపేందర్‌, అనిత పాల్గొన్నారు. మండలంలోని శాయంపేటలో రైజింగ్‌ యూత్‌ రెండో వార్షికోత్సవం సందర్భంగా హరితహారం నిర్వహించారు. సర్పంచ్‌ రజిత, ఎంపీటీసీ భిక్షపతి, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.
దామెర: పులుకుర్తి, తక్కళ్లపహాడ్‌, పసరగొండలో సర్పంచ్‌లు గోవిందు అశోక్‌, బింగి రాజేందర్‌, మేడిపల్లి సాంబయ్య మొక్కలు నాటారు. హరితహారంలో భాగస్వాములు కావాలని వారు కోరారు. కార్యక్రమంలో కారోబార్‌ ఆనందం, భిక్షపతి, సారయ్య పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలి
మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలి
మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలి

ట్రెండింగ్‌

Advertisement