వనపర్తి : దళితబంధు పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయ తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. ఈ సందర్భంగా కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామస్తులు సీఎం కేసీఆర్కు దళిత సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని గజ మాలతో ఘనంగా సన్మానించారు.