KCR | మా బతుకులు ఆగమైనయ్.. కేసీఆర్‌తో గోడు వెల్లబోసుకున్న రైతులు..!
KCR | కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్‌యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం ఆర్జాలబాయి వద్ద ఐకేపీ సెంటర్‌ను కేసీఆర్ పరిశీలించారు.
KCR | కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్‌యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం ఆర్జాలబాయి వద్ద ఐకేపీ సెంటర్‌ను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు గన్నీ బ్యాగులతో ప్రదర్శన చేపట్టారు. కేసీఆర్‌తో రైతులు మాట్లాడుతూ ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంటు లేదని.. రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ హయాంలో నడి ఎండాకాలంలో నీళ్లు మత్తళ్లు దునికేవని.. మీరు ఉన్నప్పుడే అప్పుడే బాగుండే సార్.. మళ్లీ మీ పాలనే రావాలని నినదించారు. రైతుబంధు లేదని.. రూ.500 బోనస్ అని చెప్పినా బోగస్ అయ్యిందని విమర్శించారు. కష్టపడి పండించి కల్లంల పోసిన ధాన్యాన్ని కొంటలేరని.. ఇక బోనస్ ఏమిస్తారు సార్ అని.. కాంగ్రెస్ పాలన అంత బోగస్ పాలన అయ్యిందంటూ విమర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ.. మళ్లీ పోరాడి సాధించుకుందాం.. నీళ్లు కరెంటు మళ్లీ తెచ్చుకుందాం.. పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకుముందు అన్నెపర్తి వద్ద కేసీఆర్ వాహనాన్ని రైతులు ఆపి తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Arjalabai
- ikp center
- KCR
- Nalgonda
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

