శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Wanaparthy - Jan 22, 2021 , 00:52:52

చౌడేశ్వరీదేవి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి

చౌడేశ్వరీదేవి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి

  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

పెబ్బేరు, జనవరి 21: భక్తుల కోరిన కో ర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ చౌడేశ్వరీ దే వి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. గు రువారం పెబ్బేరులోని ప్రియదర్శిని జూరాల అతిథి గృహంలో రైతుబంధు సమితి సభ్యుల తో పాటు మండలంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఎద్దుల పందేలకు ఇతర రాష్ర్టాల నుం చి వచ్చే వారికి సౌకర్యవంతమైన ఏర్పాట్లు చే యాలని చెప్పారు.  కార్యక్రమంలో రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు ఐజాక్‌, ముస్తాక్‌, టీఆర్‌ఎ స్‌ మండలాధ్యక్షుడు వనం రాములు, మర్కె ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బుచ్చారెడ్డి, విండో మాజీ చైర్మన్‌ సత్యారెడ్డి, నాయకులు సాయినాథ్‌, శేఖర్‌గౌడ్‌, మజీద్‌, సాయిరెడ్డి ఉన్నారు.

పంచాంగం ఆవిష్కరణ

వనపర్తి పాతబస్టాండ్‌, జనవరి 21: ఉ మ్మడి జిల్లా పంచాంగకర్త ఓరుగంటి మనోహర్‌శర్మ, నాగరాజు సిద్ధ్దాంతి రచించిన విప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. వనపర్తిలోని మంత్రి స్వగృహంలో ని ర్వహించిన కార్యక్రమంలో రంగనాథాచార్యు లు, మురళీశర్మ, రాంమోహన్‌శర్మన్‌, జోషి పవన్‌కుమార్‌శర్మ, నితీష్‌శర్మ, ప్రవీణ్‌, గురుప్రసాద్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

జర్నలిస్టు భవనానికి నిధులు మంజూరు చేస్తా ..

వనపర్తి, జనవరి 11 : వనపర్తిలో జర్నలిస్ట్‌ భవన్‌కు తొలి విడుతగా రూ.10లక్షలను తన నిధుల నుంచి ఇస్తానని, అందులో గ్రంథాల యం కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని  మం త్రి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ)డైరీని ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ప్రెస్‌ క్లబ్‌లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ లక్ష్మయ్య, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు మధుగౌడ్‌, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు రవీందర్‌రెడ్డి, బా లకృష్ణ, రమేశ్‌,  యూనియన్‌ సభ్యులు ప్రశాం త్‌, కొండన్నయాదవ్‌, మాధవరావు, రాము, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo