గురువారం 03 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 03, 2020 , 02:13:32

విద్యార్థికి మంత్రి చేయూత

విద్యార్థికి మంత్రి చేయూత

వనపర్తి : ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్న విద్యార్థికి నేనున్నాంటూ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భరోసా కల్పి ంచడంతోపాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రా మానికి చెందిన నితీశ్‌రెడ్డి ఉన్నత విద్య కోసం యూకేలో సీట్‌ లభించింది. మంచి కళాశాల లో సీట్‌ వచ్చింది కాని అక్కడికి వెళ్లేంత ఆర్థి క స్థోమత మాత్రం లేదు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు నాయకులు తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి సో మవారం తన క్యాంపు కార్యాలయానికి విద్యార్థి నితీశ్‌రెడ్డిని పిలిపించుకొని ఆర్థిక సహాయం కింద రూ.లక్ష విలువ గల చెక్కు ను అందజేశారు. అనుకున్న లక్ష్యాల దిశగా ముందుకు సాగే క్రమంలో ఆటుపోటులు సహజంగా తగులుతాయని అలా తగిలాయ ని వెనకడుగు వేయకుండా మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. నీపై నీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చాలని మంత్రి విద్యార్థి నితీశ్‌రెడ్డికి చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ ఉన్నారు.