నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అలివికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌తో కలిసి కట్టంగూర్ మండల కేంద్రంలో మంగళవారం రోడ్ షో నిర్వహించారు.
- బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించాలి
- నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్, మే 7 : కాంగ్రెస్ ప్రభుత్వం అలివికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌తో కలిసి కట్టంగూర్ మండల కేంద్రంలో మంగళవారం రోడ్ షో నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుంగా రోడ్ షోలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో చిరుమర్తి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మోసపూరిత మాటలు చెప్పడం సరికాదన్నారు. ఐదు నెలల్లో కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజల సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధి, సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా సుపరిపాలన అందించారని తెలిపారు. ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు ఓటు వేయాలని కోరారు. క్యామ మల్లేశ్ మాట్లాడుతూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 13న జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, నాయకులు పోగుల నర్సింహ, పెద్ది బాలనర్సయ్య, రెడ్డిపల్లి మనోహర్, అంతటి శ్రీను, చౌగోని జనార్దన్, పనస సైదులు, పిన్నపురెడ్డి నర్సింహ, గాజుల బుచ్చమ్మ, గుండగోని రాములు, కత్తుల దేవేందర్, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

