కనగల్, ఆగస్టు 12 : కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాక్టర్ల బ్యాటరీల దొంగతనం, బైక్ దొంగతనం కేసుల్లో దోషులుగా తేలిన సముద్రాల కృష్ణ, షేక్ టిప్పు సుల్తాన్‌కు నల్లగొండలోని III అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ రెండు కేసుల్లో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, దోషులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి కనగల్ ఎస్ఐ పి.విష్ణుమూర్తి, ప్రస్తుత ఎస్ఐ కె.రాజీవ్ రెడ్డి, ఏపీపీ ఎన్.కృష్ణయ్య, హెచ్‌సీ పి.నరేందర్, పీసీలు వై.నాగేశ్, ఎన్.మల్లికార్జున్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.