‘చేవెళ్ల డిక్లరేషన్’ను అమలుచేయాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ‘చేవెళ్ల డిక్లరేషన్'ను తక్షణమే అమలుచేయాలని బీఆర్ఎస్ నాయకుడు, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ముడావత్ రాంబల్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా, గిరిజనులకు ఇచ్చిన 12 హామీల్లో ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు.
- బీఆర్ఎస్ నాయకుడు రాంబల్నాయక్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ‘చేవెళ్ల డిక్లరేషన్’ను తక్షణమే అమలుచేయాలని బీఆర్ఎస్ నాయకుడు, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ముడావత్ రాంబల్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా, గిరిజనులకు ఇచ్చిన 12 హామీల్లో ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలుచేసిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో గిరిజన విద్యార్థుల కోసం ప్రకటించిన ‘విద్యాజ్యోతి’ పథకం కింద పదో తరగతి పాసైన వారికి రూ.10వేలు, ఇంటర్కు రూ.15వేలు, డిగ్రీకి రూ.25వేలు, పీజీకి రూ.లక్ష, పీహెచ్డీ/ఎంఫిల్ పూర్తిచేసిన వారికి రూ.5 లక్షలతోపాటు విద్యార్థినులకు ఉచిత సూటీలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే ఎస్టీ విద్యార్థులకు ‘అంబేదర్ అభయహస్తం’ కింద ప్రకటించిన రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించలేదని, ‘గిరిజన బంధు’ కింద ఒకొకరికీ రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న హామీ కూడా కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. గిరిజన గ్రామాలు, ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని కోరారు. ‘సమ్మక-సారక’ గ్రామపంచాయతీలకు కేటాయిస్తామన్న రూ.25 లక్షల్లో ఒక రూపాయి కూడా విడుదల చేయలేదని పేర్కొన్నారు. ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం కింద ఎస్టీలకు ప్లాట్తోపాటు రూ.6 లక్షల ఆర్థికసాయం అందజేయాలని, సేవాలాల్, ఆదివాసీ, ఎరుకల కార్పొరేషన్లకు ఏటా రూ.500 కోట్లు కేటాయించాలని రాంబల్నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

