పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?
విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో బోరుబావుల కింద వేసిన పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వ పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల విద్యుత్తు సబ్స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
- నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలి : మాజీ ఎమ్మెల్యే బొల్లం
- కరివిరాల సబ్స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా
కోదాడ, సెప్టెంబర్ 20 : విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో బోరుబావుల కింద వేసిన పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వ పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల విద్యుత్తు సబ్స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నదని మండిపడ్డారు.
విద్యుత్తు సరఫరా సక్రమంగా లేక బోర్లు, బావుల కింద వేసుకున్న పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ మూడు పంటలకు నీళ్లు ఇచ్చి రైతును రాజును చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పంటలను ఎండబెట్టి అన్నదాతలను అగచాట్లపాలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి రైతులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

