మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు
పోస్టుమార్టం కోసం భద్రపరిచిన శవం కన్ను పైభాగాన్ని ఎలుకలు పీక్కుతిన్న అమానుష ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఏరియా వైద్యశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన గారె వీరయ్య(58) శనివారం రాయపర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో దారుణం
- ఫ్రీజర్లు లేకపోవడంతోనే ఘటన
వర్ధన్నపేట, సెప్టెంబర్ 20 : పోస్టుమార్టం కోసం భద్రపరిచిన శవం కన్ను పైభాగాన్ని ఎలుకలు పీక్కుతిన్న అమానుష ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఏరియా వైద్యశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన గారె వీరయ్య(58) శనివారం రాయపర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు కేసు విచారణలో భాగంగా వర్ధన్నపేట ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. డ్యూటీ వైద్యులు సమయం దాటిపోవడంతో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు సంగెపువాగు వద్ద ఉన్న పోస్టుమార్టం గదిలో శవాన్ని భద్రపరిచారు.
పోస్టుమార్టం గదిలో విద్యుత్, ఫ్రీజర్, ఇతర వసతులు లేకపోవడంతో రాయపర్తి పోలీసులు సిబ్బందితో మాట్లాడి వీరయ్య శవాన్ని బల్లపై ఉంచి గదికి తాళం వేయించి వెళ్లిపోయారు. పోస్టుమార్టం గదిలో వసతులు లేవని చెప్పినా వినకుండా రాయపర్తి పోలీసులు వేరే అవకాశం లేకపోవడంతో శవాన్ని పీఎం గదిలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు వైద్యులు వీరయ్య శవానికి పోస్టుమార్టం చేసేందుకు గది తాళం తీసి వెళ్లి శవాన్ని పరిశీలించడంతో కన్ను పైభాగంలో ఎలుకలు పీక్కొని తిన్నట్టు కనిపించింది. ఈ దృశ్యాన్ని స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

