‘మూషిక వాహన గజానన’ గ్రంథావిషరణ
గణపతి తొలి వికాస కేంద్రం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమేనని ప్రముఖ పరిశోధకుడు, డాక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన రవించిన ‘మూషిక వాహన గజానన, తెలంగాణలో గణపతి పరిణామం’ గ్రంథాన్ని హిమాయత్‌నగర్‌లో ఆవిష్కరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : గణపతి తొలి వికాస కేంద్రం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమేనని ప్రముఖ పరిశోధకుడు, డాక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన రవించిన ‘మూషిక వాహన గజానన, తెలంగాణలో గణపతి పరిణామం’ గ్రంథాన్ని హిమాయత్‌నగర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాదాపు రెండు వేల సంవత్సరాల నాటి హాలుని ‘గాథాసప్తశతి’, గుణాఢ్యుని ‘బృహతథ’ వంటి ప్రాచీన సాహిత్య ప్రస్తావనలతో పాటు కృష్ణానదికి ఇరువైపులా లభించిన శిల్పాలు, శాసనాలు, స్థానిక జానపద సంప్రదాయాలను ఈ గ్రంథంలో విశ్లేషించినట్టు తెలిపారు.
గోవింద్ దాస్, డీపీ చటోపాధ్యాయ వంటి పూర్వ పరిశోధకుల సిద్ధాంతాలతోపాటు, తెలుగు నేల నుంచే గణపతి ఆరాధన ఉత్తర భారతదేశానికి, ఇతర ఉపఖండ ప్రాంతాలకు ఎలా విస్తరించిందో ఇందులో ఆధారసహితంగా పొందుపరిచామని వివరించారు. అంతేకాకుండా గణపతి సంప్రదాయాలు బౌద్ధ, జైన మతాల్లోకి ప్రవేశించిన తీరును, తెలుగు ప్రాంత మౌఖిక కథనాల ప్రాధాన్యతను సమన్వయం చేస్తూ చారిత్రక ఆధారాలతో ఈ గ్రంథాన్ని వెలువరించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పండితులు పంచాంగం అజయ్, విజయ్, శ్రీనివాస్, మహేశ్, వినోద్, ప్రతీక్తోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

