ప్రైవేట్ భూముల్లోకి కాంగ్రెస్ లీడర్లా.. ఫామ్‌హౌస్‌లు ఏమైనా టూరిస్ట్ కేంద్రాలా?
ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారని, ఫామ్‌హౌస్‌లు ఏమైనా టూరిస్ట్ కేంద్రాలా అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్ సందర్శన పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.
- భూదోపిడీ ఆధారాలు ఉంటే వెల్లడించండి
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 20 : ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారని, ఫామ్‌హౌస్‌లు ఏమైనా టూరిస్ట్ కేంద్రాలా అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్ సందర్శన పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఫాంహౌస్ భూములను సందర్శిస్తే అర్థం చేసుకోవచ్చు గానీ, అధికారం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది కదా అని నేతలు ఫామ్‌హౌస్ భూముల సందర్శనకు వెళ్లడం ఏందని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లో ఒకవేళ సరార్ భూములుంటే తక్షణమే స్వాధీనం చేసుకొనే హకు ప్రభుత్వానికి ఉన్నదని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు రూ.లక్ష కోట్ల భూదోపిడీ చేసినట్లు ఆధారాలుంటే ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ అనర్హత కేసులో స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిందని విమర్శించారు. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ను జనం అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. దానం నాగేందర్ తనను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని, అయితే వినాయకుడిని చివర్లో నిమజ్జనం చేస్తారనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే బెటర్ అని సూచించారు. 22ఏతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను పరిషరించకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

