శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 13, 2021 , 00:11:37

16న మొదటి విడుత వ్యాక్సినేషన్‌

16న మొదటి విడుత వ్యాక్సినేషన్‌

  • సెంటర్ల వద్ద అంబులెన్స్‌లు తప్పనిసరిగా ఉంచాలి
  • పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి
  • 17న పల్స్‌పోలియో రద్దు
  • జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు 

వికారాబాద్‌, జనవరి 12 : జిల్లాలో ఈనెల 16న మొదటి విడుత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తామని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. మంగళవారం  కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈనెల 16వ తేదీన జిల్లాలోని మూడు సెంటర్లలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని సూచించారు. వికారాబాద్‌ ప్రభుత్వ దవాఖాన, తాండూరు జిల్లా దవాఖాన, మహావీర్‌ దవాఖానల్లో వ్యాక్సినేషన్‌ వేయనున్నట్లు చెప్పారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద తప్పకుండా అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. టీకాలు వేసిన వారి వివరాలను ఆన్‌లైన్‌తో పాటు రిజిస్ట్రర్‌లో నమోదు చేయాలన్నారు. ఈనెల 16న విద్యుత్‌ అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్‌ చేసిన వారికి తప్పకుండా అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఈ సెంటర్‌లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. కొవిడ్‌ సెంటర్ల వద్ద పారుశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మాస్కులు, వ్యక్తిగతదూరం, పాటించేలా చూడాలన్నారు. ఈనెల 17వ తేదీన పల్స్‌పోలియో కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తదుపరి తేదీని తేలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో జయరాజ్‌, డాక్టర్‌ అరవింద్‌, వైద్య సిబ్బంది, డీపీవో రిజ్వాన, జడ్పీ సీఈవో ఉషా, డీడబ్ల్యూవో లలితకుమారి, అధికారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo