గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 06, 2021 , 00:11:38

కంపోస్టు షెడ్డు పనులు పూర్తి చేయాలి

కంపోస్టు షెడ్డు పనులు పూర్తి చేయాలి

బషీరాబాద్‌, జనవరి 5: కంపోస్టు షెడ్లు, శ్మశాన వాటికల నిర్మాణాలను త్వరగా పూ ర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని మం డల ప్రత్యేకాధికారి శంకర్‌ రాథోడ్‌ పేర్కొ న్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మం గళవారం మంతట్టి, మసాన్‌పల్లి గ్రామాల్లో పర్యటించి కంపోస్టు షెడ్లు, శ్మశాన వాటిక లు, రైతువేదికల నిర్మాణాలను పరిశీలించా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో దాదాపుగా అన్ని గ్రామ పం చాయతీల్లో కంపోస్టు షెడ్లు, శ్మశాన వాటిక ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మంతట్టి, మసాన్‌పల్లి, మైల్వార్‌, మంతన్‌గౌడ్‌, కంసా న్‌పల్లి(బి), కొర్విచేడ్‌ఘని, క్యాద్గీరా, అల్లాపూర్‌(బి) ఎనిమిది పంచాయతీల్లో ఈ నెల ఎనిమిదో తేదీలోగా పూర్తి చేయాలని సర్పంచ్‌లకు సూచించామన్నారు. మిగతా గ్రామాల్లో కంపోస్టు షెడ్లను వాడకంలోకి తెచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీవో రమేశ్‌, ఈసీ ఆశోక్‌ కుమార్‌, టీఏ నర్సింహరెడ్డి, సర్పంచ్‌లు దశరథ్‌, బీమప్ప పాల్గొన్నారు.

VIDEOS

logo