ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 27, 2020 , 04:48:56

ప్రమాద ఘటన దురదృష్టకరం

ప్రమాద ఘటన దురదృష్టకరం

వికారాబాద్‌: జిల్లాలోని మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లిలో రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మంత్రి మర్పల్లి ప్రభుత్వ దవాఖానకు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ, ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున డబుల్‌ బెడ్రూం ఇండ్లు, ఇతర వాటిపై విచారణ జరిపి సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసుకు మంత్రి ఆదేశించారు.  ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. గ్రామ శివారులో తప్పనిసరిగా స్పీడ్‌ బ్రేకర్లు, ప్రమాద సూచిక బోర్డులు, వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దవాఖానలో పోస్టుమార్టం జరిగిన తర్వాత మృతదేహాలను ట్రాక్టర్‌లో పంపించేందుకు సిద్ధం చేయగా, మంత్రి కల్పించుకుని 108లో తరలించాలని కలెక్టర్‌కు ఆదేశించారు. అనంతరం మృతుల కుటుంబాలకు మంత్రి సబితారెడ్డి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.50వేలు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రూ.50 వేలు, వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ రూ.25 వేలు అందజేశారు. వీరి వెంట చేవెళ్ల ఎమ్మెల్యే కాలెయాదయ్య ఉన్నారు. 

VIDEOS

logo