మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Vikarabad - Sep 16, 2020 , 01:26:49

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

వికారాబాద్‌: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీఎంఎస్‌ జిల్లా చైర్మన్‌ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జనవరిలో కొడంగల్‌ డీసీఎంఎస్‌ పరిధిలో  మొత్తం 5,943 మంది రైతుల వద్ద నుంచి కందు లు కొనుగోలు చేశామని తెలిపారు. అయితే డబ్బు ల చెల్లింపు విషయంలో మార్కెఫెడ్‌, డీసీఎంఎస్‌ అధికారుల మధ్య వ్యత్యాసం రావడంతో కందుల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు.

ఈ అక్రమాలకు పాల్పడ్డ కొడంగల్‌ డీసీఎంఎస్‌ బ్రాంచి మేనేజర్‌ను సస్పెండ్‌ చేయడంతో పా టు ఆరుమంది తాత్కాలిక ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. వారిపై కొడంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. రూ.76 లక్షలు అక్రమాలు జరుగగా వారి నుంచి రూ. 57. 29 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, మి గతా 19.30 లక్షలు రికవరీ చేస్తున్నామన్నారు. రికవరీ చేసిన డబ్బులను 118మంది రైతులకు వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేసినట్లు తెలిపారు. మిగతా 18మంది రైతులకు త్వరలో చెల్లిస్తామన్నారు.సిబ్బ ంది అక్రమాలకు పాల్పడకుండా డీసీఎంఎస్‌ కా ర్యాలయాల్లో ఏండ్ల పాటు ఒకే బ్రాంచీలో ఉన్న సి బ్బందిని మిగతా బ్రాంచీలకి బదిలీ చేస్తున్నామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు.

ముఖ్యంగా రైతులు ద ళారులను నమ్మి మోసపోవద్దన్నారు.దళారులు అ ప్పటికప్పుడు డబ్బు ఇచ్చి రైతుల వద్ద తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ, తూకాల్లో అవకతవకలకు పాల్పడుతూ మోసం చేస్తున్నారన్నారు. రైతులు డీసీఎంఎస్‌ కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు.అయితే ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా లక్షా 56వేల క్వింటాళ్ల కందులను 26220 మం ది రైతులనుంచి కొనుగోలు చేసి రూ.111కోట్లు చె ల్లించామని డీసీఎంఎస్‌ జిల్లా చైర్మన్‌ కృష్ణారెడ్డి స్ప ష్టం చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ నర్సింహు లు,బిజినెస్‌ మేనేజర్‌ పాండురంగం,డీసీఎంఎస్‌ తా ండూరు బ్రాంచి మేనేజర్‌ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


logo