Loksabha Elections 2024 | ప్రచారంలో ప్రజా సమస్యల ఊసెత్తని మోదీ : ప్రియాంక గాంధీ
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతల ప్రసంగాలు చూస్తుంటే అసంబద్ధమైన అంశాలను లేవనెత్తడం కనిపిస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతల ప్రసంగాలు చూస్తుంటే అసంబద్ధమైన అంశాలను లేవనెత్తడం కనిపిస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన వాస్తవ అంశాలను మరుగునపరిచేందుకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేరళలోని వయనాద్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు మీరు ఎదుర్కొనే సమస్యలను ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించడం లేదని దుయ్యబట్టారు.
వారు అభివృద్ధి గురించి మాట్లాడరు..ప్రజల సమస్యల గురించి ప్రస్తావించారు..ప్రతి రోజూ ప్రజలకు సంబంధం లేని కొత్త అంశాలను తెరపైకి తీసుకువచ్చి గందరగోళపరుస్తారని ప్రియాంక పేర్కొన్నారు. మీ అభివృద్ధితో సంబంధం లేని, మీ బాగోగులతో సంబంధం లేని అసంబద్ధమైన విషయాలపై మాట్లాడతారని ఆమె ఆరోపించారు.
రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం, ధరల మంట గురించి కాషాయ నేతలు అసలు నోరు మెదపరని మండిపడ్డారు. మీడియా మొత్తం వారు లేవనెత్తే అసంబద్ధ అంశాల చుట్టూ చర్చించేలా చూస్తూ వాటినే ఎన్నికల అంశాలుగా మలిచేందుకు ప్రయత్నిస్తారని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
Read More :
Rahul Gandhi: ఏ శక్తీ కుల గణనను అడ్డుకోలేదు: రాహుల్ గాంధీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

