David Warner | ఉచిత ఆధార్ కోసం పరుగులు తీసిన డేవిడ్ వార్నర్.. ఫన్నీ వీడియో వైరల్
David Warner | ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఉచిత ఆధార్ కార్డు (Aadhar Card) కోసం పరుగులు తీస్తూ కనిపించాడు.
David Warner | ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఇక్కడ అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున ఆడుతున్న వార్నర్‌కు క్రికెట్ మాత్రమే కాదు.. ఇతర యాక్టివిటీలు కూడా ఎక్కువే. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన రీల్స్‌తో అభిమానులు ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ స్టార్ క్రికెటర్. తను పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైకులు వస్తుంటాయి. ఈ ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ తాజాగా మరో రీల్‌తో అభిమానుల ముందుకొచ్చాడు. తాజా వీడియోలో వార్నర్ ఉచిత ఆధార్ కార్డు (Aadhar Card) కోసం పరుగులు తీస్తూ కనిపించాడు.
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో హోస్ట్‌తో వార్నర్ కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ సమయంలో సినిమాకు వెళ్దామని హోస్ట్.. వార్నర్‌ను అడగ్గా రాలేనని సమాధానమిస్తాడు. ఇక ఫ్రీ భోజనం అని చెప్పనా వద్దంటాడు. చివరకు అక్కడ ఆధార్ కార్డు (Aadhar Card) ఉచితంగా ఇస్తున్నారు అని చెప్పగానే.. వార్నర్ వెంటనే హోస్ట్‌ను ఎత్తుకుని ‘చలో చలో..’ అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. ఈ ఫన్నీ వీడియోని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నవ్వులు పూయిస్తోంది.
Finallyyyyyy, Warner now has a _______? 👀🤣 pic.twitter.com/gDoCtT62eA
— Delhi Capitals (@DelhiCapitals) April 23, 2024
Also Read..
Kangana Ranaut | దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపై ఆ అలలు కొనసాగుతాయ్ : కంగనా రనౌత్
Tesla layoffs | ఈవీ దిగ్గజం కొలువుల కోత : 6 వేల మందిపై టెస్లా వేటు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

