శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - May 24, 2020 , 22:47:32

మైనార్టీల సంక్షేమానికి సర్కారు కృషి

మైనార్టీల సంక్షేమానికి  సర్కారు కృషి

 పలుచోట్ల  బియ్యం, సరుకులు అందజేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు 

పరిగి : టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగి పట్టణంలోని  1500మైనార్టీ కుటుంబాలు, నస్కల్‌లో 150 కుటుంబాలకు రంజాన్‌   కానుకగా ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు   నిత్యావసర వస్తువులు అందించామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యామ్‌సుందర్‌రెడ్డి, పరిగి మున్సిపాల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, కో-ఆప్షన్‌ మాజీ సభ్యులు మీర్‌మహమూద్‌అలీ, కౌన్సిలర్‌ వేముల కిరణ్‌, నాయకులు రవికుమార్‌ పాల్గొన్నారు. 

నిత్యావసర సరుకులు పంపిణీ

కులకచర్ల : ప్రభుత్వం ద్వారా ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ  చేస్తున్నామని కామునిపల్లి   సర్పంచ్‌ పాల మహిపాల్‌రెడ్డి, అంతారం ఎంపీటీసీ లలిత పేర్కొన్నారు. ఆదివారం కామునిపల్లి, అంతారం గ్రామాల్లో  రంజాన్‌ కానుకగా వచ్చిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో కామునిపల్లిలో మాజీ సర్పంచ్‌ బాలయ్య, ఉపసర్పంచ్‌ అంజిలయ్య, అంతారంలో టీర్‌ఎస్‌ నాయకులు మొగులయ్య, శివానంద్‌, సాయన్న, ముస్లింలు పాల్గొన్నారు. 

పేదలకు రంజాన్‌ కానుక

కొడంగల్‌ : మండలంలోని చిట్లపల్లిలో మజీద్‌ కమిటీ సభ్యు లు ఆదివారం గ్రామంలోని మసీదులో నిరుపేదలకు రంజాన్‌ కానుకగా కొత్త దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సదర్‌ సాహబ్‌  సయ్యద్‌ వహీద్‌, ఎండీ.అక్బర్‌ అలీ, షెక్‌ అబ్దుల్లా పాల్గొన్నారు. 

దోమ : ముస్లింలకు సహాయం చేయడానికి  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీటీసీ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం  మల్లేపల్లి, దిర్సంపల్లి, బ్రాహ్మణపల్లి, బడెంపల్లి   గ్రామా ల్లో ముస్లింలకు రంజాన్‌   సందర్భంగా బియ్యం, చక్కెర, సేమి యా, ఖర్జూర, పండ్లు   జడ్పీటీసీ పంపిణీ చేశారు.  కార్యక్రమం లో మల్లేపల్లి సర్పంచ్‌ దోడ్ల అంజిలయ్య, దిర్సంపల్లి సర్పంచ్‌ శాంతాకొండారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రాఘవేందర్‌రెడ్డి, జోగు నర్సిములు, సర్వార్‌   పాల్గొన్నారు.

పండుగను ఇండ్లలోనే జరుపుకోవాలి

ఇబ్రహీంపట్నం : రంజాన్‌ను ఇండ్లలోనే జరుపుకోవాలని ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి అన్నారు. ఆదివారం రంజాన్‌ పండుగ సందర్భంగా వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ముస్లింల పవిత్రమైన పండుగ రంజాన్‌

కొత్తూరు : ముస్లింలు అతి పవిత్రంగా భావించే పండుగ రంజాన్‌ అని కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, కొత్తూరు ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. రంజాన్‌ పండుగను పురస్కరించుకుని మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో వార్డుసభ్యుడు సయ్యద్‌ రషీద్‌ ఆధ్వర్యంలో ఆదివారం 350 మంది ముస్లింలకు దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రవీందర్‌యాదవ్‌, మధుసూదన్‌రెడ్డి హాజరై వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్‌ పండుగను సామరస్యంగా జరుపుకోవాలన్నారు. గ్రామంలోని నిరుపేదలకు ప్రతి ఏడాది రషీద్‌ దుస్తులు, వస్తువులను పంపిణీ చేయటం సంతోషకరమన్నారు. వార్డు సభ్యుడు రషీద్‌ భవిష్యత్‌లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శ్రీరాములు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు యాదిగిరి, నాయకులు యాదగిరి, హమీద్‌, ఫయాజ్‌, సాదక్‌, జబ్బర్‌ పాల్గొన్నారు.


logo