తాండూరు రూరల్, ఆగస్టు:దశలవారీగా గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చింతామణిపట్టణం, పర్వతాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారని గుర్తు చేశారు. నేరుగా దళితుల అకౌంట్స్‌లో రూ.10 లక్షల నగదు జమ చేసి, చరిత్ర సృష్టించారని తెలిపారు. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, రైతు కోసం 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. “పల్లె ప్రగతి” పేరుతో గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని తెలిపారు.
గత పాలకులు గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారని తెలిపారు. ప్రజాసంక్షేమ పరమావాధిగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు గౌడి మంజుల, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విఠల్‌రెడ్డి, రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాందాస్, ఎంపీటీసీ సాయిరెడ్డి, సర్పంచులు లాల్‌రెడ్డి, విమలమ్మ, టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు శకుంతల, ఉమాశంకర్, వేణుగౌడ్, రైతు బంధు సమన్వయ సమితీ నాయకులు రాంలింగారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మొగులప్ప పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.