కొడంగల్, ఆగస్టు :ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా నిరుపేదలు, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా చదువుతుంటారని, వారికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు బిచ్చాల మల్లయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు బిచ్చాల మల్లయ్యతో పాటు కుటుంబ సభ్యులు బిచ్చాల నితన్,రాధికలు 300ల మంది విద్యార్థులకు సరిపడ 110 డ్యూఎల్ టేబుల్స్‌ను అందించారు.
ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో రాంరెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు సౌకర్యాలు అందిస్తే ఉన్నత చదువుల్లో రాణించే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పాఠశాలలో ప్రశాంత వాతావరణం, సౌకర్యాలు అందుబాటులలో ఉన్నప్పుడు విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఎంతో కృషి చేసి ప్రస్తుతం 1500ల మొక్కలకు ప్రాణం పోసి పెంచుకొంటున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాలకు టేబుల్స్ అందించిన దాతలను ఉపాధ్యాయులు సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.