
కులకచర్ల, ఆగస్టు : పేదల అభివృద్ధికి తమవంతు కృషిచేయడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామంలో జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కరోనా కారణంగా లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్నవారికి తమ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో నిరుపేదలకు, అనాథలకు, చెంచుకుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు శానిటైజర్లు అందిస్తున్నామని వివరించారు. పేదలకు సహయం చేయడమే ధ్యేయంగా తమ స్వచ్ఛంద సంస్థ సేవలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఎంపీటీసీ శంకర్, ఉపసర్పంచ్ శివకుమార్, వార్డు సభ్యుడు అశోక్, జాట్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, జన్సహాస్ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.