కులకచర్ల, ఆగస్టు : ప్రతి ఇంటికీ స్వచ్చంధంగా పన్నులు చెల్లించాలని కులకచర్ల గ్రామ సర్పంచ్ సౌమ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పన్నులు వసూలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న గ్రామంలో ప్రతి ఇంటికి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని తెలిపారు.
గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పన్నుల చెల్లింపు కూడా ముఖ్యమేనని తెలిపారు. పన్నుల చెల్లింపుల ఆధారంగా ప్రభుత్వం ద్వారా కూడా నిధులు మంజూరవుతాయని అన్నారు. తెలంగాణ పల్లె ప్రగతిలో వివిధ పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తమవంతు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.