న్యూఢిల్లీ, అక్టోబర్ 1: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో గా అనూప్ బాగ్చి నియమితులయ్యారు. ఈ నెల 27 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.