హైదరాబాద్, అక్టోబర్ 1: అడ్వైర్టెజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) బోర్డు డైరెక్టర్గా స్లోకా అడ్వైర్టెజింగ్ ఎండీ, సీఈవో శ్రీనివాస్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏఏఏఐ బోర్డుకు తిరిగి ఎన్నికవడం చాలా సంతోషంగా ఉన్నదని, పరిశ్రమలోని అనుభవజ్ఞులైన నాయకులతో కలిసి పనిచేసే అవకాశం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పారు.